ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలకు డిమాండ్: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ

By narsimha lode  |  First Published Apr 26, 2023, 10:58 AM IST

 రాష్ట్రంలో  ఇసుక  అక్రమ తవ్వకాలపై  చర్యలు తీసుకోవాలని  చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి  జవహర్ రెడ్డికి లేఖ  రాశారు. 


అమరావతి:  ఇసుక అక్రమ తవ్వకాలపై  ఏపీ సీఎస్  జవహర్ రెడ్డికి  టీడీపీ చీఫ్  చంద్రబాబు  బుధవారంనాడు లేఖ రాశారు.  రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై పలుమార్లు మీకు గతంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  ఈ   ఫిర్యాదులపై  చర్యలు తీసుకోలేదని చంద్రబాబు  ఆరోపించారు.  అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని  ఆయన  ఆ లేఖలో  ప్రస్తావించారు. వైఎస్ఆర్'సీపీ  నేతలతో  ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు  ఆరోపించారు. 

అనుమతికి  మించి జయప్రకాష్ వెంచర్స్ ఇసుక తవ్వకాలకు చేస్తోందని  చంద్రబాబు  చెప్పారు. ఇక్కడ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో కూడా విచారణ జరిగిందని చంద్రబాబు  గుర్తు  చేశారు.  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ , ఇతర కోర్టుల నుండి అనేక ఆదేశాలు ఉన్నప్పటికీ ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టలేదన్నారు.  నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని   చంద్రబాబు   ఆ లేఖలో పేర్కొన్నారు.  

Latest Videos

అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలు, అధికారులు విఫలం అవుతున్నారని విమర్శించారు.  ఇష్టారీతిన ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం జరగుతుందన్నారు. 
 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టాలని  చంద్రబాబు ఆ లేఖో సీఎస్ జవహర్ రెడ్డిని  కోరారు. 

click me!