అమరావతి జేఎసీ గురువారం నాడు ప్రారంభించనుంది.ఈ బస్సు యాత్రను చంద్రబాబునాయడు ప్రారంభించనున్నారు.
అమరావతి: రాజధాని అమరావతిపై జేఎసీ తలపెట్టిన చైతన్య యాత్రను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు ప్రారంభించనున్నారు. పోలీసులు అడ్డుకొన్న ప్రాంతం నుండే ఈ బస్సు యాత్రను బాబు ప్రారంభిస్తారు.
అమరావతిపై జేఎసీ తలపెట్టిన యాత్రను బుధవారం నాడు పోలీసులు అడ్డుకొన్నారు. పోలీసులు అడ్డుకొన్న ప్రాంతం నుండే బస్సు యాత్రను చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు.
Also read:చంద్రబాబు అరెస్ట్: పీఎస్‌కు తరలించే వాహనం ‘కీ‘ మాయం, కదలని బండి
జేఎసీ కార్యాలయంలో అమరావతి పరిరక్షణ కమిటీ నేతలతో గురువారం నాడు ఉదయం చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ఈ బస్సు యాత్రను పోలీసులు అడ్డుకొన్నా కూడ నిర్వహించి తీరాలని జేఎసీ నిర్ణయించింది.
చంద్రబాబునాయుడు నేతృత్వంలో విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి జేఎసీ ప్రతినిధులు ర్యాలీగా వెళ్లనున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు మచిలీపట్నం వెళ్లనున్నారు. మచిలీపట్నం కోనేరు సెంటర్ లో నిర్వహించే బహిరంగసభలో చంద్రబాబునాయుడు పాల్గొంటారు.
కాకినాడ, ఒంగోలు పట్టణాల్లోనూ చైతన్య సభలు నిర్వహించాలని అమరావతి పరిరక్షణ కమిటీ నిర్ణయం తీసుకొంది.ప్రజా చైతన్య యాత్రలను అడ్డుకొంటామని ఉత్తరాంధ్ర మేధావుల సంఘం, రాయలసీమ విద్యార్థి జేఎసీ ప్రకటించింది.