ప్రత్యేక హోదా: 15వ ఆర్థిక సంఘం చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published Oct 11, 2018, 6:53 PM IST
Highlights

రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ తరపున ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బీజేపీ నుంచి సుధీష్ రాంబోట్ల, సీపీఎం నుంచి మధుతోపాటు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. 

అమరావతి: రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ తరపున ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బీజేపీ నుంచి సుధీష్ రాంబోట్ల, సీపీఎం నుంచి మధుతోపాటు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. 

సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై అన్ని పార్టీలు గొంతెత్తడంతో ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇప్పటికే ఇచ్చే ఉంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా అంశం సమ్మతమైన అంశమని ఇప్పటికే ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటారని ఆశించినట్లు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంట్ కు వచ్చినప్పుడు తాను రాజ్యసభలో ఉన్నట్లు తెలిపారు. 

ప్రత్యేక హోదా రాజకీయ నిర్ణయం అని అన్నారు. అసలు హోదా అంశం ఆర్థిక సంఘాల పరిధిలోకి రాదని తేల్చి పారేశారు. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. గతంలో విభజన చట్టాల అమలుకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ బాధ్యులుగా ఉండేవారు. కానీ ఏపీ పునర్విభజన చట్టం అమలుకు పర్యవేక్షణ వ్యవస్థ లేదన్నారు. 

హోదాపై 14వ ఆర్థిక సంఘం సరైన విశ్లేషణాత్మ క వివరణ ఇవ్వలేదన్నారు. హోదా అంశాన్ని14వ ఆర్థిక సంఘం క్షుణ్ణంగా పరిశీలించిందనుకోవడం లేదన్నారు. ఏపీకి హోదావ ఇస్తామని పార్లమెంట్ లో చెప్పారని గుర్తు చేశారు. 

తన పరిధిలోకి రాని ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం అనవసరంగా వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యల వల్ల కేంద్రానికి ఓ సాకు దొరికిందని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యం లేఖపోతే జైట్లీ లాంటి వాళ్లు ఈ వాదన చేసే అవకాశం ఉండేది కాదన్నారు. అసలు విభజన హామీల అమలకు  ప్రత్యేక వ్యవస్థ లేకుండా విభజించింది ఒక్క ఏపీనే అని తెలిపారు.హోదా అంశాన్ని తప్పించేందుకే 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపించారు. 

మరోవైపు ఏపీ అవసరాలపై తమకు సానుభూతి ఉందని చైర్మన్ ఎన్ కే సింగ్ తెలిపారు. తమ పరిధిలో చెయ్యగలిగినంత చేస్తామని తెలిపారు. హోదాపై స్పష్టత ఇవ్వాలని అన్ని పార్టీలు కోరాయని తెలిపారు. ఏపీ రాజధాని, పోలవరానికి నిధులివ్వాల్సి ఉందని స్పష్టం చేశారు. రెవెన్యూ లోటు భర్తీపై ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ కు తెలిపినట్లు సీపీఎం కార్యదర్శి మధు తెలిపారు. బుందేల్ ఖండ్ తరహాలో వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ విషయంలో అన్యాయం జరిగిందని అలాగే రాజధాని నిర్మాణానికి నిధుల మంజూరు, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. 

నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ నిధులను ఎస్సీఎస్టీలకు కేటాయించడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు సూచించినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ముఖ్యమైన అంశమని ఎన్ కే సింగ్ చెప్పినట్లు మధు తెలిపారు. రాజ్యసభలో పునర్విభజన చట్టం బిల్లు పెట్టినప్పుడు తాను రాజ్యసభలో చప్పట్లు తట్టామన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించినప్పుడు ఎంతో హర్షించినట్లు చెప్పారని తెలిపారు. 

మరోవైపు సమావేశంలో బీజేపీ తమ వాదనలు వినిపించింది. ప్రత్యేక హోదా అంశం అనే ఊసే ఎత్తలేదు. ఈ సమావేశంలో ప్రభుత్వతీరును బీజేపీ నేతలు తప్పుబట్టారు. ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే ఏపీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులు ఇచ్చినా వైద్య విద్య రంగాలను ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. 

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నిధులు ఆగిపోయాయని సూచింనట్లు బీజేపీ నేత సుధీష్ రాంబొట్ల తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తుందని అందువల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా రాష్ట్రానికి సూచనలు చేయాలని సూచించారు. 

ప్రత్యేక హోదా అనేది బిరుదు మాత్రమే అన్న సుధీష్ రాంబోట్ల ప్రత్యేక హోదా ముగిసిన అథ్యయనం అంటూ కొట్టిపారేశారు. ప్రత్యేక హోదాను సెంటిమెంట్ గా రెచ్చగొట్టేందుకే రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. 

సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, స్థానిక సంస్థల నిధులు ఆలస్యం కాకుండా చూడాలని, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. కోస్టల్ డిస్ట్రిక్స్ వరదల నష్టానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినటర్లు తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ప్రత్యేక హోదా: మా పరిధిలోకి రాదన్న 15వ ఆర్థిక సంఘం

 

ఏపీ రాజకీయ బాధిత రాష్ట్రం:కేంద్రంపై చంద్రబాబు ఫైర్
click me!