4 గంటలుగా కారులోనే: ఎయిర్‌పోర్టులోనే బాబు బైఠాయింపు

By narsimha lodeFirst Published Feb 27, 2020, 3:21 PM IST
Highlights

విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో చంద్రబాబునాయుడు బైఠాయించి నిరసనకు దిగారు. బాబు  కాన్వాయ్ ను వైసీపీ నేతలు అడ్డుకొన్నారు. 

విశాఖపట్టణం:  విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో   టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో చంద్రబాబును విశాఖపట్టణం నుండి  తిరిగి వెనక్కు పంపించేందుకు  పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. మూడు గంటలుగా  చంద్రబాబునాయుడు విశాఖ ఎయిర్ పోర్టులోనే ఉన్నాడు.

Also read:నాడు జగన్‌, నేడు బాబు: విశాఖ ఎయిర్‌పోర్టులో సీన్ రిపీట్

విశాఖపట్టణం జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించేందుకు గురువారం నాడు ఉదయం చంద్రబాబునాయుడు విశాఖ పట్టణానికి చేరుకొన్నాడు. విశాఖ పట్టణంలో బాబు కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణులు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు.

బాబు కాన్వాయ్‌ ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నారు.  వైసీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. కొద్ది దూరం కాన్వాయ్  ముందుకు వెళ్లింది. ఈ తరుణంలో  మరోసారి వైసీపీ శ్రేణులు  అడ్డుపడ్డారు. 

చంద్రబాబునాయుడు పాదయాత్రగా  వెళ్లాలని భావించాడు.  కానీ బాబును పోలీసులు అడ్డుకొన్నారు. పాదయాత్రగా వెళ్లాల్సిన పరిస్థితులు లేవని  బాబుకు పోలీసులు సర్ధిచెస్పారు. ఈ తరుణంలో చంద్రబాబునాయుడు తన కారులోనే కూర్చొన్నారు.

వైసీపీ నేతలు బాబు కాన్వాయ్ కదలకుండా అడ్డుపడ్డారు. దీంతో కారులోనే బాబు కూర్చొన్నాడు. చంద్రబాబునాయుడును తిరిగి వెళ్లాలని పోలీసులు కోరారు.మరో వైపు తమను అరెస్ట్ చేయాలని పోలీసులు చెప్పడంతో  చంద్రబాబు సహ టీడీపీ నేతలు  ఎయిర్ పోర్టులోనే బైఠాయించారు.

ఎయిర్ పోర్టులోనే బాబు బైఠాయించి పోలీసుల తీరున తప్పుబట్టారు.తమ కార్యక్రమానికి ఎందుకు పోలీసులు అనుమతిని ఇచ్చారో చెప్పాలని టీడీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు.

 

 

click me!