విశాఖలో ఉద్రిక్తత: పాదయాత్రను అడ్డుకొన్న పోలీసులు, కారులోనే బాబు

By narsimha lode  |  First Published Feb 27, 2020, 1:47 PM IST

చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన  సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నాడు బాబు కాన్వాయ్ ను వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి. 


విశాఖపట్టణం: వైసీపీ శ్రేణులు అడ్డుపడడంతో పాదయాత్రగా ఎయిర్‌పోర్టు నుండి బయలుదేరిన టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పోలీసులు సర్ధిచెప్పారు. పాదయాత్రగా వెళ్లే పరిస్థితులు లేనవి బాబుకు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. పాదయాత్రకు బాబుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆయన కారులోనే కూర్చొన్నారు.

Also read:బాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, చెప్పులతో వైసీపీ దాడి: విశాఖలో తీవ్ర ఉద్రిక్తత

Latest Videos

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నారు.  చంద్రబాబు కాన్వాయ్‌ను విశాఖ ఎయిర్‌పోర్టు వద్దే  వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నారు. బాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు.  

వైసీపీ శ్రేణులను అడ్డు తొలగించి కాన్వాయ్‌ను ముందుకు పంపారు పోలీసులు. అయితే  బాబు కాన్వాయ్‌కు మరోసారి వైసీపీ శ్రేణులు అడ్డుపడ్డాయి. మహిళలు, వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నారు. దీంతో బాబు స్థానికంగా ఉన్న నేతలతో కొద్దిసేపు చర్చించారు.

పాదయాత్రగా  చంద్రబాబునాయుడు  నిర్ణీత  షెడ్యూల్  ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కారు దిగి చంద్రబాబునాయుడు కొద్దిదూరం నడిచారు.  కానీ, చంద్రబాబునాయుడును పోలీసులు అడ్డుకొన్నారు. 

బాబు చుట్టూ జడ్‌ప్లస్ సెక్యూరిటీ   సిబ్బంది, బాబు గన్ మెన్లు, పార్టీ కార్యకర్తలు వలయంగా  నడిచారు. ఈ తరుణంలోనే చంద్రబాబుకు పోలీసులు సర్ధిచెప్పారు. పాదయాత్రగా వెళ్లే పరిస్థితులు లేవని పోలీస్ ఉన్నతాధికారులు బాబుకు చెప్పారు. దీంతో చంద్రబాబునాయుడు తన కారులోనే కూర్చొన్నారు. సుమారు రెండు గంటలకు పైగా బాబు తన కారులోనే  కూర్చొన్నారు. 


 

click me!