నాడు వైఎస్ జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకొన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖకు వచ్చిన బాబును వైసీపీ అడ్డుకొంది.
విశాఖపట్టణం: వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకొన్నారు. చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్రకు వైసీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు.చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా ఎయిర్‌పోర్టులోనే ధర్నాకు దిగి ఆయన హైద్రాబాద్‌కు తిరిగి వెళ్లారు. ఇవాళ చంద్రబాబునాయుడు కాన్వాయ్ ను వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి.
Also read:విశాఖలో ఉద్రిక్తత: పాదయాత్రను అడ్డుకొన్న పోలీసులు, కారులోనే బాబు
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విశాఖ పట్టణం బీచ్ రోడ్డులో వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. అయినా కూడ వైఎస్ జగన్ ఆ పార్టీకి చెందిన నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులతో కలిసి విశాఖ పట్టణానికి వచ్చారు.
Also read:విశాఖలో ఉద్రిక్తత: పాదయాత్రను అడ్డుకొన్న పోలీసులు, కారులోనే బాబు
ఎయిర్‌పోర్టులోనే విశాఖ పోలీసులు వైఎస్ జగన్ ను అడ్డుకొన్నారు. 2017 జనవరి 26వ తేదీన విశాఖలో జగన్‌ను అడ్డుకొన్నారు పోలీసులు. పోలీసుల తీరును నిరసిస్తూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులోనే జగన్, ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ధర్నాకు దిగారు.
also read:బాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, చెప్పులతో వైసీపీ దాడి: విశాఖలో తీవ్ర ఉద్రిక్తత
తనను అడ్డుకొన్న పోలీసులపై జగన్ ఆ సమయంలో తీవ్రంగా మండిపడ్డారు. రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోంది. మీ అందరి సంగతి చూస్తానని జగన్ హెచ్చరించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఎయిర్ పోర్టులో తనను అడ్డుకొన్న పోలీసులపై చర్యలు తీసుకొన్నారని సమాచారం. ఈ పోలీసులపై ఈ గత ఏడాది జూలై మాసంలో వీఆర్ కు పంపారని సమాచారం.
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు విశాఖ పట్టణానికి వచ్చారు. మూడు రాజధానులను టీడీపీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబునాయుడు మాత్రం అమరావతికే మద్దతు ప్రకటించారు.
విశాఖను జగన్ సర్కార్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని ప్రకటించింది. ఈ తరుణంలో విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడును వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి అనుకూలమని ప్రకటించిన తర్వాతే విశాఖలో పర్యటించాలని వైసీపీ డిమాండ్ చేసింది.తమ పర్యటనకు పోలీసుల అనుమతి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పర్యటనను కొనసాగుతోందని టీడీపీ నేతలు తేల్చి చెప్పారు.
చంద్రబాబునాయుడు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొన్న సమయం నుండి ఉద్రిక్తత కొనసాగింది. బాబు కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణులు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. బాబు కాన్వాయ్ విమాశ్రయం నుండి కొద్దిదూరం వెళ్లింది. ఆ తర్వాత చంద్రబాబునాయుడు పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు బాబును అడ్డుకొన్నారు.