పెనుకొండలో కియా మోటార్స్ తొలి కారును విడుదల చేసిన బాబు

By narsimha lodeFirst Published Jan 29, 2019, 12:31 PM IST
Highlights

అనంతపురంలో కియా సంస్థ తయారు చేసిన కియా కారును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విడుదల చేశారు.
 


అనంతపురం: అనంతపురంలో కియా సంస్థ తయారు చేసిన కియా కారును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విడుదల చేశారు.

అనంతపురం జిల్లాలోని పెనుకొండలో  కియా కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్ల తయారీ కేంద్రంలో  తయారు చేసిన తొలి కారును మంగళవారం నాడు చంద్రబాబునాయుడు  విడుదల చేశారు. 

650 ఎకరాల్లో 13వేల కోట్లతో ఈ ఫ్యాక్టరీని కియా సంస్థ ఏర్పాటు చేసింది. ఎస్‌యూవీ మోడల్ తొలి కారును బాబు ఇవాళ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు.కియా మోటార్స్ లో ప్రత్యక్షంగా , పరోక్షంగా 11వేల మందికి ఉపాధి లభిస్తోందని చంద్రబాబునాయుడు చెప్పారు.ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. భవిష్యత్తులో  దక్షిణ కొరియాతో  తాము పోటీ పడతామని చంద్రబాబునాయుడుచెప్పారు. ఏపీ వాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపారం చేసే అవకాశం ఉందని చెప్పారు.

భవిష్యత్తులో ఏపీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ హబ్‌గా మారనుందన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ను  తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయని ఆయన చెప్పారు. 
 


 

click me!