హైటెక్ సిటీ నిర్మించా...తిరుపతిని హార్డ్ వేర్ హబ్ గా తీర్చిదిద్దుతా:చంద్రబాబు

By Nagaraju TFirst Published Oct 4, 2018, 6:28 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లకు అవకాశాలు రావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తన కృషి ఫలితంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కనీస సౌకర్యాలు కూడా లేని చోట సైబరాబాద్‌ నిర్మించామని, ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌ హబ్‌గా తిరుపతిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.  

తిరుపతి: ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లకు అవకాశాలు రావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తన కృషి ఫలితంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కనీస సౌకర్యాలు కూడా లేని చోట సైబరాబాద్‌ నిర్మించామని, ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌ హబ్‌గా తిరుపతిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.  

చిత్తూరు జిల్లా రేణుగుంటలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలు వై తిరుపతి అంటే వై నాట్‌ తిరుపతి అని చెప్పానని అందువల్లే ఇక్కడకు కంపెనీలు తరలివస్తున్నట్లు తెలిపారు. 

పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదరిందని అవి అమలైతే 32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆరు నెలల్లో కియా పరిశ్రమకు నీళ్లు ఇచ్చామని, జనవరిలో కియా కారు రోడ్డుపైకి వస్తోందని చంద్రబాబు తెలిపారు. 

దేశంలో ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న చంద్రబాబు ఐదారేళ్లలో ప్రపంచంలోనే టాప్‌-5లో ఏపీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో ఏర్పాటైన కంపెనీలతో 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, త్వరలో ఏర్పాటు కానున్న కంపెనీలతో మరో 34 వేల ఉద్యోగాలు రానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 
 

click me!