చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్: బెయిల్ పై అత్యవసర విచారణకై ఏపీ హైకోర్టులో పిటిషన్

Google News Follow Us

సారాంశం

చంద్రబాబు తరపు న్యాయవాదులు   ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను ఇవాళ దాఖలు చేశారు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బెయిల్ పిటిషన్ పై  అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.

అమరావతి:టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు  గురువారంనాడు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. చంద్రబాబు ఎడమ కంటికి మూడు మాసాల క్రితం కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు  కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరపాల్సి ఉందని  చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9న  చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు  అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ఈ పిటిషన్ పై  అత్యవసరం గా విచారణ జరిపించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరుతున్నారు.  చంద్రబాబు కంటికి ఆపరేషన్ జరపాల్సిన అవసరం ఉందని  ఏపీ హైకోర్టులో  దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ లో  ఆయన తరపు లాయర్లు కోరారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  చంద్రబాబు తరపు న్యాయవాదులు  సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీని దాఖలు చేశారు.ఎస్ఎల్‌పీపై  ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి.  ఈ కేసులో  17 ఏ చుట్టూ వాదనలు జరిగాయి.  17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని  ఆయన తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా  వాదించారు.

 17 ఏ చంద్రబాబుకు వర్తించదని  ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు  తీర్పును రిజర్వ్ చేసింది.ఈ  ఏడాది నవంబర్  8న  సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల  29న సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. 

also read:జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ  నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి  బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. నిన్న చంద్రగిరిలో బస్సు యాత్ర ప్రారంభమైంది.  చంద్రబాబు అరెస్ట్ తో మనోవేదనకు గురై మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను  భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.