కేసీఆర్ కు చంద్రబాబు కౌంటర్:బీజేపీ డైరెక్షన్లోనే కేసీఆర్

Published : Oct 04, 2018, 09:22 PM IST
కేసీఆర్ కు చంద్రబాబు కౌంటర్:బీజేపీ డైరెక్షన్లోనే కేసీఆర్

సారాంశం

నేను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబునాయుడు నీ గతి ఏమౌతోందో ఆలోచించుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బీజేపీ డైరెక్షన్లోనే నడుస్తున్నారని ఆరోపించారు. మెుదట్లో ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందని విమర్శించారు. 

తిరుపతి: నేను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబునాయుడు నీ గతి ఏమౌతోందో ఆలోచించుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బీజేపీ డైరెక్షన్లోనే నడుస్తున్నారని ఆరోపించారు. మెుదట్లో ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందని విమర్శించారు. 

ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్, జగన్ పవన్ జతకట్టారని ధ్వజమెత్తారు. మోదీ డైరెక్షన్లోనే వీరంతా  కలిసి పనిచేస్తున్నారని మండిపడ్డారు. పరుష పదజాలం నా విధానం కాదన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రపన్నుతుందని ఆరోపించారు. 40 ఏళ్ల టీడీపీని తెలంగాణలో వదులుకోవాలా అని ప్రశ్నించారు. 

హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన టీడీపీ అక్కడ ఉండకూడదా అని నిలదీశారు. బడుగుల జీవితాలు మార్చిన టీడీపీ ఉండొద్దనే ఆలోచ ఎందుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. మోదీని చూస్తే భయపడాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి తనపై విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP
స్థానిక ఎన్నికలకు జనసేన తొలి జాబితా.. 14 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు