ఎంతోమంది విలన్లను తట్టుకున్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి మాకు రాలేదు: చంద్రబాబు

Published : May 04, 2019, 04:45 PM ISTUpdated : May 04, 2019, 04:47 PM IST
ఎంతోమంది విలన్లను తట్టుకున్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి మాకు రాలేదు: చంద్రబాబు

సారాంశం

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రకృతి కూడా టీడీపీకి కలిసివచ్చిందన్న చంద్రబాబు తొలిదశలోనే ఎన్నికలు పెట్టడం మేలైందని చెప్పుకొచ్చారు. తమను ఎన్నోన ఇబ్బందులు పెట్టాలని చూశారని కానీ తమ నెత్తినే పాలు పోశారంటూ చెప్పుకొచ్చారు.   

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారని, అయితే ఏపీలో అలాంటి పరిస్థితి రాలేదంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో కానీ, బహిరంగ సభలలో కానీ టీడీపీ తప్పు చేసిందని ఎవరైనా నిలదీశారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

అలాంటి పరిస్థితి మనకు రాలేదని అది తెలుగుదేశం పార్టీకి గర్వకారణమన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రకృతి కూడా టీడీపీకి కలిసివచ్చిందన్న చంద్రబాబు తొలిదశలోనే ఎన్నికలు పెట్టడం మేలైందని చెప్పుకొచ్చారు. 

తమను ఎన్నోన ఇబ్బందులు పెట్టాలని చూశారని కానీ తమ నెత్తినే పాలు పోశారంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఎంతోమంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యడానికి తెలంగాణ నుంచి వెళ్తారని హైదరాబాద్ ఏపీకి బస్సులు రద్దు చేశారంటూ చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం