అమిత్ షాకి ఏం తెలియదట..మహారాష్ట్రలో ఎవరి ప్రభుత్వం ఉంది: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Sep 16, 2018, 4:00 PM IST
Highlights

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై మండిపడ్డారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రూ.225 కోట్లతో నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని సీఎం ఇవాళ ప్రారంభించి జలసిరికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎస్సార్‌ఎస్పీ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్ట్‌ను కట్టారని.. అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుంటే.. తానే బాబ్లీకి వ్యతిరేకంగా ఉద్యమించానని .. బాబ్లీతో పాటు ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంపు విషయంలోనూ పోరాడానని చంద్రబాబు తెలిపారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆల్మట్టి ఎత్తు పెంపును ఆపలేకపోయాయని సీఎం ఆరోపించారు.

నాటి పోరాటంపై ఎనిమిదేళ్ల తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారని.. అరెస్ట్ వారెంట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని అమిత్ షా అంటున్నారని.. మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉంది..? ఎవరి ప్రభుత్వం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. నాటకాలు ఆడాల్సిన అవసరం తనకు లేదని.. బ్యాంకులను దోచుకుంటున్న వారిని విదేశాలకు పంపుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసుని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు.

click me!