ఆ విషయం జగన్ కు ఎవరు, నోటీసులు కుట్ర కాదా: చంద్రబాబు

By rajesh yFirst Published Sep 15, 2018, 5:41 PM IST
Highlights

ప్రధాని నరేంద్రమోదీపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు పరిపక్వత ఉందని, తనకు లేదని పార్లమెంట్‌లో మోదీ అంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. దేశంలో ఏపీని నెంబర్ వన్ చేస్తానని సంకల్పం చేశానని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేసి చాలా ఇబ్బందులు పెట్టారని, అప్పుడు కేసులు లేవని చెప్పి.. ఇప్పుడు వారెంట్‌లు పంపించారని విమర్శించారు. 

శ్రీకాకుళం: ప్రధాని నరేంద్రమోదీపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు పరిపక్వత ఉందని, తనకు లేదని పార్లమెంట్‌లో మోదీ అంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. దేశంలో ఏపీని నెంబర్ వన్ చేస్తానని సంకల్పం చేశానని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేసి చాలా ఇబ్బందులు పెట్టారని, అప్పుడు కేసులు లేవని చెప్పి.. ఇప్పుడు వారెంట్‌లు పంపించారని విమర్శించారు. 

రాష్ట్రానికి అన్యాయం చేస్తే రాజీలేని పోరాటం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వరు..పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వరు...విభజన హామీలను అమలు చెయ్యడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రజలు దేశ పౌరులు కాదా అని ప్రశ్నించారు. తమ రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టడం లేదా అని ఎద్దేవా చేశారు. 

 కేంద్రం సహకరిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని,కేంద్రం సహకరించకపోయినా 10.5 శాతం గ్రోత్‌ రేటు సాధించామని స్పష్టం చేశారు. విద్యుత్‌ ధరలు పెంచబోమని చెప్పిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, హైదరాబాద్‌ అభివృద్ధి ప్రతి అడుగులో తన కృషి ఉందని వెల్లడించారు. ప్రతిపక్షాలు కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.  

జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలెందుకన్నారు. లాలూచీ రాజకీయాలు చెయ్యడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పని అని దుయ్యబుట్టారు చంద్రబాబు. తామే గెలుస్తామని ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు సర్వే చేయించుకుంటున్నాడని విమర్శించారు. ఏ అనుభవం ఉందని జగన్ ను ప్రజలు గెలిపిస్తారన్నారు. 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని తెలిపారు.  

మరోవైపు ఉత్తర తెలంగాణ కోసమే బాబ్లీ పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. కేసులు పెట్టమని చెప్పి ఇప్పుడు నోటీసులు పంపించడమంటే కుట్ర కాదా అని  ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే బాబ్లీ నోటీసులు ఇచ్చారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 8ఏళ్ల తర్వాత నోటీసులు రావడానికి కారణం ఏంటని కుట్రలో భాగం కాదా అన్నారు. 

click me!