
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొడమలలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోధానందస్వామి వర్గీయులకు గ్రామస్తులకు మధ్య శనివారం రాత్రి గొడవ జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం నాడు గ్రామంలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొడమలలో ప్రబోధానందస్వామి వర్గీయులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ సమాచారం అందుకున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకొన్నారు.
ప్రబోధానందస్వామి వర్గీయులకు గ్రామస్తులకు శనివారం నాడు గొడవ చోటు చేసుకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం నాడు గ్రామంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. గ్రామస్తులకు న్యాయం జరిగేవరకు తాను నిరసనను వీడబోనని చెప్పాడు.
గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించాడు.