పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉంది: చంద్రబాబు

By narsimha lode  |  First Published Jan 8, 2023, 4:10 PM IST

పొత్తులపై మాట్లాడేందుకు  ఇంకా సమయం ఉందని  చంద్రబాబునాయుడు  చెప్పారు. జీవో నెంబర్  1పై తా ము ప్రధానంగా చర్చించినట్టుగా  చంద్రబాబు తెలిపారు. 


 హైదరాబాద్ :పొత్తులపై మాట్లాడేందుకు  ఇంకా సమయం ఉందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆదివారంనాడు  హైద్రాబాద్ లోని తన నివాసంలో  పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇవాళ  ప్రధానంగ జీవో నెంబర్  1 గురించి చర్చించినట్టుగా  ఆయన  చెప్పారు.  ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయని  చంద్రబాబు చెప్పారు.   ఎన్నికలకు ముందు  పొత్తులపై చర్చిస్తామని  చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులపై  చర్చించడానికి పార్టీలు ముందు ఉండాలన్నారు. రాష్ట్రంలో  ప్రజాస్బామ్యాన్ని కాపాడేందుకు గాను  రాజకీయ పార్టీలు  ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక  పేరుతో  పార్టీలు , ప్రజా సంఘాలు ప్రభుత్వం  తెచ్చే  ప్రజా వ్యతిరేక  విధానాలపై  పోరాటం   చేయనున్నట్టుగా  చంద్రబాబు వివరించారు. పార్టీల మనుగడ ఉంటేనే  పొత్తులు అనే  అంశం ఉంటుందని  చంద్రబాబు  చెప్పారు.

also read:ఎక్కడైనా పోటీ చేయవచ్చు: ఏపీలో బీఆర్ఎస్ పోటీపై పవన్ కళ్యాణ్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో  అసెంబ్లీలో తాను మాట్లాడేందుకు  లేస్తే ఆయన కూర్చొనేవాడన్నారు. తాను  సీఎంగా  ఉన్న  సమయంలో  కూడా  అదే రీతిలో  వ్యవహరించినట్టుగా  చంద్రబాబు గుర్తు చేశారు. కానీ జగన్  మాత్రం ఓ సైకోగా  వ్యవహరిస్తున్నాడన్నారు. జగన్  తీరుతో  గత నాలుగేళ్లుగా  అనేక అవమానాలను  ఎదుర్కొన్నట్టుగా  చంద్రబాబు చెప్పారు. జగన్ ను ఎదుర్కోనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.  చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కంటే  జగన్  గొప్పవాడా అని  ఆయన  ప్రశ్నించారు.  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తామన్నారు.

Latest Videos

 అవసరమైతే   రాష్ట్రంలో  జరుగుతున్న పరిణామాను  కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తామని  చంద్రబాబు చెప్పారు.   రాష్ట్రంలో  ఎమర్జెన్సీ కంటే  భయంకర పరిస్థితులున్నాయన్నారు. ఎమర్జెన్నీలో  రాత్రి పూట  పోలీసులు గోడలు దూకి రాలేదన్నారు. కానీ జగన్ పాలనలో  రాత్రి పూజ పోలీసులు గోడదూకి వచ్చి అరెస్ట్  చేస్తున్నారని  చంద్రబాబు విమర్శించారు.పొత్తులపై ఒప్పుడే చర్చ అవసరం లేదని  పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై  చర్చించామన్నారు.  ఈ విషయమై  చంద్రబాబుతో చర్చించినట్టుగా  తెలిపారు.  ఈ విషయమై  న్యాయపోరాటమా, ప్రజా పోరాటమా,  వీధి పోరాటం చేయాలా అనే విషయమై చర్చించామన్నారు. 

click me!