
ప్రతీ నవజాత శిశువుకి అవసరమైన 11 వస్తువులతో కూడిన బేబీ కిట్‌ను ప్రభుత్వం రూ.1,410 వ్యయంతో ఉచితంగా అందించనుంది. రాష్ట్ర బడ్జెట్ నుంచే ఈ పథకానికి కావాల్సిన నిధులు ఖర్చు చేయనున్నారు.
గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద కేంద్ర ప్రభుత్వం కొంత భాగం నిధులను అందించేది. అయితే ప్రస్తుతం PH-ABHIM, పీఎం మాతృత్వ వందన యోజన, 15వ ఆర్థిక కమిషన్ నిధుల కింద కూడా సాయం లభించే అవకాశం లేకపోవడంతో, పూర్తిగా రాష్ట్ర ఖర్చుతోనే బేబీ కిట్‌ల పంపిణీ జరగనుంది.
దోమ తెరతో కూడిన బేబీ బెడ్
వాటర్‌ప్రూఫ్ కాట్ షీట్
బేబీ డ్రెస్సు
వాషబుల్ నేప్కిన్స్
టవల్
బేబీ పౌడర్
బేబీ షాంపూ
బేబీ ఆయిల్
బేబీ సబ్బు
సోప్ బాక్స్
బేబీ రాటిల్ టాయ్
ఈ కిట్‌లు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమయ్యే ప్రతి తల్లికి ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్న నేపథ్యంలో ఈ పథకం మరింత ఉపయోగకరంగా మారనుంది.