ప్రజా కూటమిని గెలిపించండి, టీఆర్ఎస్ ను ఇంటికి పంపండి:చంద్రబాబు

By Nagaraju TFirst Published Nov 26, 2018, 3:22 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంలే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఓడిపోవాలని ప్రజాకూటమి గెలవాలని చంద్రబాబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తన హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 
 

గుంటూరు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంలే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఓడిపోవాలని ప్రజాకూటమి గెలవాలని చంద్రబాబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తన హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 

గుంటూరు జిల్లా గోదావరి పెన్నా నదుల అనుసంధానం మెుదటి దశ పనులను ప్రారంభించిన చంద్రబాబు హైదరాబాద్ మహానగరం తన  మానసిక పుత్రిక అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించేందుకు తాను విదేశాల్లో కాలినడకన నడిచానని గుర్తు చేశారు. 

మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు హైదరాబాద్ లో రప్పించేందుకు తాను ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపారు. బిల్ గేట్స్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎంతో ప్రయత్నించి తీసుకుని హైదరాబాద్ గురించి చెప్పి మైక్రోసాఫ్ట్ సాధించానని తెలిపారు. 

తెలుగుప్రజలకు ఉపాధి కలగాలన్న ఉద్దేశంతోనే తాను హైదరబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టానన్నారు. హైదరాబాద్ మహానగరం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఆ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ఓడిపోవాలని ప్రజాకూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్ లో తాను ప్రతీ వీధి వీధి తిరిగానని నగరం అభివృద్ధి కోసం ఉదయమే తనిఖీలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందాలని మరింత మందికి ఉపాధి కల్పించాలని చెప్పుకొచ్చారు. సైబరాబాద్ లాంటి నిర్మాణాలు జరగాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. 

ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ ఏపీపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మద్దతు పలికిని టీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చిందన్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని తాను కోరుకుంటుంటే కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నాడని తనను తిడుతున్నాడని చెప్పుకొచ్చారు. 

సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో కుమ్మక్కు అయ్యారని ధ్వజమెత్తారు. అందువల్లే తమకు ప్రత్యేక హోదాపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని నిలదీశారు. అటు ఏపీలోని వైసీపీ, జనసేనలు సైతం మోదీ కనుసన్నుల్లోనే నడుస్తున్నారని తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల రాజధానులు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అటు హైదరాబాద్ మహానగరం, ఇటు అమరావతి రెండు రాజధానులు అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆలోచించి ప్రజాకూటమిని గెలిపించాలని చంద్రబాబు కోరారు.  

click me!