కేసీఆర్! నీకు రాజకీయ జీవితాన్నిచ్చింది టీడీపీయే, నన్ను తిడతావా: బాబు

Published : Nov 26, 2018, 03:06 PM ISTUpdated : Nov 26, 2018, 03:09 PM IST
కేసీఆర్! నీకు రాజకీయ జీవితాన్నిచ్చింది టీడీపీయే, నన్ను తిడతావా: బాబు

సారాంశం

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నిన్న మెున్న రోజూ తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

గుంటూరు: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నిన్న మెున్న రోజూ తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేసీఆర్ తిట్టినా తాను పట్టించుకోవడం ఆయన్ను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడి వాడని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీయేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో తన అనుచరుడుగా ఉండేవాడని తనతోనే ఉండేవాడని అలాంటి వ్యక్తి తనను తిడుతుంటే బాధ ఉండదా అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ అభివృద్ధికి తాను ఎంతో పోరాటం చేశానని అందుకు తిడతున్నారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో మైక్రో సాఫ్ట్ కంపెనీ కోసం ఎన్ని పాట్లు పడ్డానో ప్రజలకు తెలుసునన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ప్రపంచ చిత్ర పటంలో ప్రత్యేక స్థానం వచ్చింది అంటే అది తనవల్లేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నో సవాళ్లు చూసిందని అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కొందన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా టీడీపీ బలపడుతుందే తప్ప బలహీన పడుతుందని అనుకుంటే అది వారి అవివేకం అన్నారు. హైదరాబాద్ నగరం తన మానసిక పుత్రిక అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

అలాంటి హైదరాబాద్ ను తాను నిర్మిస్తే కేసీఆర్ తనపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ మహానగరాన్ని నిర్మిస్తే అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. 40వేల కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణ పనులు చేపట్టామని పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. 

ప్రపంచంలో ఐదు మహానగరాల్లో అమరావతి ఒకటిగా చూపిస్తామని కేసీఆర్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu