కోపమే: మురళీమోహన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Published : May 11, 2018, 03:36 PM ISTUpdated : May 11, 2018, 03:43 PM IST
కోపమే: మురళీమోహన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీమోహన్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు

అమరావతి: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీమోహన్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మురళీ మోహన్ మంచి నిర్మాత, మంచి నటుడు గానీ పార్టీకే ఉపయోగపడడం లేదని ఆయన అన్నారు. 

ఎంపిగా పనిచేసేందుకు సమయం సరిపోవడం లేదని మురళీ మోహన్ చెప్పారురు. మురళీమోహన్ పై వ్యతిరేకతతోనే చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

ప్రతిపక్షం విమర్శిస్తే విడిచిపెట్టకూడదని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. టీడీపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఆ విధంగా అన్నారు. పబ్లిసిటీ రావడం లేదని అమెరికా నుంచి ఓ మహిళ చెప్పిందని, ఆ దిశగా అందరూ పనిచేయాలని అన్నారు. 

దాచేపల్లి ఘటన దురదృష్టకరమని అన్నారు. టెక్నాలజీ వల్ల చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విలువలు లోపించడం వల్లనే మనుషులు అలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పిల్లలు టెక్నాలజీకి బానిసలవుతున్నారని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu