ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు లేఖ! కారణమేంటీ?

By Rajesh KarampooriFirst Published Mar 28, 2023, 10:41 PM IST
Highlights

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా ఆయన పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని విడుదల చేసేందుకు 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు లేఖ రాశారు. 

ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు లేఖ రాశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై తెలుగు దేశం పార్టీ అధినతే చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారు. NTR ప్రత్యేక నాణెం విడుదల చేయడం హర్షించదగిన విషయమన్నారు. 

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై టీడీపీ పోలిట్ బ్యూరో మీకు ధన్యవాదాలు తెలిపిందని ప్రధాని మోదీకి తెలిపారు. ప్రత్యేక నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చంద్రబాబు అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో స్వాగతించిందని, ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఎన్టీఆర్ ను గౌరవించడమంటే.. తెలుగు వారిని, తెలుగు జాతిని గౌరవించడమేనని  చంద్రబాబు అన్నారు. 

ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, వ్యక్తిగతంగా తన తరుపున  ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని విడుదల చేసేందుకు 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది. టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ సీఎం ఎన్టీఆర్‌ పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముద్రణకు శ్రీకారం కూడా చుట్టింది. 

click me!