జీవీఎంసీ ఎన్నికలు: కమ్యూనిస్టులతో చంద్రబాబు టీడీపీ పొత్తు

By telugu team  |  First Published Feb 26, 2021, 9:17 AM IST

కమ్యూనిస్టు పార్టీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ దోస్తీ కడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జీవీఎంసి ఎన్నికల్లో టీడీపీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు కుదుర్చుకుంది. రేపు టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించనుంది.


విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు పొత్తు కుదుర్చుకున్నాయి. టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. దీంతో ఈ మూడు పార్టీలు కలిసి జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

సీపీఐ, సీపీఎంలు రెండేసి స్థానాలకు పోటీ చేస్తాయి. మిగతా స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుంది. జీవీఎంసిలో మొత్తం 98 వార్డులున్నాయి. ఈ 98 వార్డులకు కూడా మూడు పార్టీల కూటమి పోటీ చేయనుంది. టీడీపీ తన పార్టీ అభ్యర్థులను రేపు శనివారం ప్రకటించనుంది. 

Latest Videos

undefined

జీవీఎంసీలో గతంలో 81 వార్డులుండగా వాటిని 98కి పెంచారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 8 జోన్లు ఉన్నాయి. మధురవాడ, అసిల్ మెట్ట, సూర్యబాగ్, జ్ఞానాపురం, గాజువాక, వేపగుంట, భిమిలీ, అనకాపల్లి జోన్లు ఉన్నాయి. జీవీఎంసి ఎన్నికలను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పోటీ చేయనున్నాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్పోరేషన్లకు, పురపాలక సంఘాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

click me!