కరోనాతో బాధితులకు పరిహారం: టీడీపీ చీఫ్ చంద్రబాబు నిరసన దీక్ష

By narsimha lodeFirst Published Jun 29, 2021, 10:43 AM IST
Highlights

 కరోనాతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని  డిమాండ్ చేస్తూ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ సీనియర్లు దీక్షకు దిగారు. ఇదే డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు.

అమరావతి: కరోనాతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని  డిమాండ్ చేస్తూ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ సీనియర్లు దీక్షకు దిగారు. ఇదే డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు.కరోనా కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ చెబుతోంది. బాధిత కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని చంద్రబాబునాయుడు ఇవాళ నిరసన దీక్షకు పూనుకొన్నారు.

 

కరోనాతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ సీనియర్లు దీక్షకు దిగారు. ఇదే డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. pic.twitter.com/vN1UUuhudR

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక మరణించిన కరోనా బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేసింది. మరో వైపు  తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న పేదలు కరోనా బారినపడితే ఆ కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.ఇవాళ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష నిర్వహించనున్నారు టీడీపీ నేతలు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని టీడీపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు.

click me!