చింతమనేని వీడియో వివాదం: వైసిపి మీదికి నెట్టిన చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Feb 21, 2019, 12:14 PM IST
Highlights

వైసీపీ వాళ్లే సీన్ క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టినట్లు పోలీసులు ధృవీకరించారని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలపునిచ్చారు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు, వీడియో కటింగ్ లు చేస్తారు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 
 
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యలు, దోపిడీలు, దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంటూ ఆరోపించారు. వాళ్లే సీన్ క్రియేట్ చేస్తారు,వారే దుష్ప్రచారం చేస్తారని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

అమరావతిలో టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైసీపీతో పోరాటం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియోపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ వాళ్లే సీన్ క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టినట్లు పోలీసులు ధృవీకరించారని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలపునిచ్చారు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు, వీడియో కటింగ్ లు చేస్తారు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 

ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. క్రిమినల్ రాజకీయాలకు చిరునామా వైఎస్ జగన్ కుటుంబం అని సీఎం ధ్వజమెత్తారు. నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. 

ప్రత్యర్థుల నేరచరిత్ర గుర్తుంచుకొని, ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థంగా ఎదుర్కోవాలని నేతలకు సూచించారు. అన్నినియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు వారీగా సమీక్షలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 

అన్ని అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు, ఏరియా కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. టీడీపీ గెలుపులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాక్షించారు. అందరికీ జవాబుదారీతనం ఉండాలే నేతలు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. 

click me!