అదే జరిగితే చంద్రబాబు, లోకేషే మిగులుతారు: రోజా

Published : Feb 21, 2019, 11:34 AM IST
అదే జరిగితే చంద్రబాబు, లోకేషే మిగులుతారు: రోజా

సారాంశం

వైసీపీలో వలసలపై కేసీఆర్, మోదీ కుట్ర ఉందంటూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చకే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని రోజా హెచ్చరించారు.   

తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు పూటకో స్టంట్లు చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

వైసీపీలో వలసలపై కేసీఆర్, మోదీ కుట్ర ఉందంటూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చకే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని రోజా హెచ్చరించారు. 

వైఎస్ జగన్ బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వస్తున్నారన్న ఆమె వచ్చే ప్రతీ నాయకుడు తమ పదవులకు రాజీనామాలు చేసి వస్తున్నారని అది వైఎస్ జగన్ నైతిక విలువలకు నిదర్శనమన్నారు. 

చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారంటూ రోజా ధ్వజమెత్తారు. మరోవైపు పుల్వామా ఉగ్రవాద దాడి ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. 

మోదీ రాజీనామా చేయాలనడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు చేసిన పబ్లిసిటీ స్టంట్ వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారని మరి చంద్రబాబు రాజీనామా చేశారా అంటూ ప్రశ్నించారు. 

పాక్ ఉగ్రవాదుల చరర్యకు ప్రధాని నరేంద్రమోదీని రాజీనామా చెయ్యమంటున్న చంద్రబాబు ఆ నాడు 30 మంది ప్రాణాలు బలిగొన్నందుకు ఎందుకు రాజీనామా చెయ్యలేదని నిలదీశారు. చంద్రబాబు మీటింగ్ కోసం ఒక రైతును దారుణంగా కొట్టి చంపారని ఆరోపించారు.

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదోచెప్పాలని డిమాండ్ చేశారు.దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను సీఎం చంద్రబాబు గతంలో అవమానించారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబును ఫాలో అవుతున్నట్లు ఉన్నారని రోజా ఘాటుగా విమర్శించారు.
 

PREV
click me!

Recommended Stories

తందనానా–2025’ విజేతలకు సీఎం చంద్రబాబు బంగారు పతకాలు | Indian Cultural Heritage | Asianet News Telugu
ISRO Set to Launch LVM3-M6 with BlueBird Block-2 Satellite | Students Reaction | Asianet News Telugu