కరోనా నియంత్రణ చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్:కరోనా నియంత్రణ చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసుల విషయంలో ప్రతిపక్షం సూచనలు చేస్తోంటే అధికారపక్షం రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు.
undefined
కరోనా తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోందన్నారు. కరోనాను తక్కువగా అంచనా వేయొద్దని తాను మొదటి నుండి చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని 11 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. హాట్ స్పాట్స్ పై కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేసిన ఇద్దరు డాక్టర్లు రాష్ట్రంలో మృతి చెందారన్నారు. కరోనా తీవ్రతను తక్కువ చేసి చూపితే చాలా ప్రమాదమని బాబు అభిప్రాయపడ్డారు.
also read:కాణిపాకంలోనే ప్రమాణం, డేట్ నేనే చెబుతా: విజయసాయి సవాల్ కు కన్నా 'సై'
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుండి పోరాటం చేస్తున్న వారికి పీపీఈ కిట్స్ అందించాలని ఆయన కోరారు.డాక్టర్ల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కరోనా వ్యాప్తి నివారణకు ఫీల్డ్ లో పనిచేస్తున్న వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా పరీక్షలు చేసే కిట్స్ కొనుగోలులో ఎక్కువ ధర కోడ్ చేసిన విషయం బయటపడడంతో తక్కువ ధరకే తమకు కూడ దక్షిణ కొరియా ఇవ్వనుందని చెప్పడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరితే తమపై కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.