వయసుమళ్లిన సీఎంలంతా అలా...ఈ యువ ముఖ్యమంత్రి ఇలా: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Apr 21, 2020, 1:03 PM IST
Highlights

కరోనాపై వయసుమల్లిన ముఖ్యమంత్రులంతా అద్భుతంగా పోరాడుతుంటే యువ ముఖ్యమంత్రిగా చెప్పుకునే జగన్ మాత్రం తన రాజప్రాసాదం నుండి బయటకు రావడంలేదని మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

గుంటూరు: కరోనా మహమ్మారి దేశంలో కోరలుచాస్తున్న వేళ వయసుమల్లిన ముఖ్యమంత్రులంతా అద్భుతంగా పనిచేస్తుంటే యువ ముఖ్యమంత్రిగా చెప్పుకునే జగన్ మాత్రం ఇంట్లోంచి బయటకు రావడంలేదని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే  కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆయనకు ప్రజాశ్రేయస్సు కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కరోనా నివారణ చర్యల తో పాటు ప్రజల్ని కాపాడుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు.65 ఏళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గ్రౌండ్ లో పని చేస్తున్నారు. 65 ఏళ్ళ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి  క్షేత్రస్థాయిలో ఉన్నారు''

''63 ఏళ్ళ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహాయక కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటున్నారు. 58 ఏళ్ళ అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ క్షేత్రస్థాయిలో కరోనా నివారణ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 61 ఏళ్ళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహన్ గ్రౌండ్ లెవల్ లో తిరుగుతూ రైతుల కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు''

''మేఘాలయా ముఖ్యమంత్రి కోనార్డ్ సంగ్మా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలకు సహాయం అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గ్రౌండ్ లో పని చేస్తున్నారు.77 ఏళ్ళ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్షేత్ర స్థాయిలో ఉండి కరోనా పై పోరాటం చేస్తున్నారు.మరి యువ ముఖ్యమంత్రిని అనే చెప్పుకునే,ఆంధ్రప్రదేశ్ సిఎం తాడేపల్లి రాజప్రసాదంలో నుంచి బయటకు రారా? రాజకీయమే ఆయనకి ముఖ్యమా?'' అని కింజరాపు అచ్చన్నాయుడు మండిపడ్డారు. 

click me!