పదవతరగతి పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్ధుల భవిష్యత్తుకే నష్టమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంటుందని ఆయన చెప్పారు.
అమరావతి: పదవతరగతి పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్ధుల భవిష్యత్తుకే నష్టమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంటుందని ఆయన చెప్పారు.జగనన్న వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని బుధవారం నాడు ప్రారంభించారు.
విపత్కర పరిస్థితుల్లో కూడ కొంత మంది విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదన్నారు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని ఆయన గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీఎం చెప్పారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా భవిష్యత్తు ఉంటుందన్నారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకొంటామని సీఎం చెప్పారు.
సర్టిఫికెట్లలో పాస్ అని ఇస్తేనే ఏ కాలేజీలో విద్యార్ధులకు సీట్లు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కష్టతరమైనా కూడ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలు రద్దు చేయాలని కోరడం సులభమే కానీ నష్టపోయేది విద్యార్ధులేనని ఆయన చెప్పారు.