మోదీ పర్యటనపై జగన్, పవన్ ఎందుకు నోరు మెదపరు : చంద్రబాబు

Published : Dec 26, 2018, 11:55 AM IST
మోదీ పర్యటనపై జగన్, పవన్ ఎందుకు నోరు మెదపరు : చంద్రబాబు

సారాంశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటించడంపై ఆ పార్టీలు ఎందుకు నోరు మెదడపం లేదని నిలదీశారు. 

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటించడంపై ఆ పార్టీలు ఎందుకు నోరు మెదడపం లేదని నిలదీశారు. 

ప్రధాని మోదీతో వైసీపీ, జనసేన పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. అందువల్లే  మోదీ పర్యటనపై జగన్‌, పవన్‌ నోరు మెదపడం లేదన్నారు. వైసీపీ, జనసేన  నిరసనలు చెయ్యకపోవడం వెనుక కారణం కూడా చీకటి ఒప్పందమేనన్నారు. 

విభజన గాయంపై కారం పూసేందుకే మోదీ వస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై తాము మెుదటి నుంచి పోరాటం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదేపదే చెప్తోందని మరీ అలాంటి పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ వస్తుంటే ఎందుకు నిరసనకు పిలుపు ఇవ్వడం లేదని విమర్శించారు. 

మరోవైపు తాను లేవనెత్తాను కాబట్టే ప్రత్యేక హోదా ఉద్యమం ఇంతటి స్థాయికి వచ్చిందని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అడ్డుపడుతున్న మోదీ ఏపీకి వస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

మోడీ ఎపి పర్యటనపై చంద్రబాబు తిరుగుబాటు: బహిష్కరణకు పిలుపు

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!