వెంకటేశునితో పెట్టుకుంటే.. చంద్రబాబు ట్వీట్

By telugu news teamFirst Published Dec 25, 2020, 11:17 AM IST
Highlights

తిరుమల వెంకన్నతో పెట్టుకుంటున్న వారి సంగతేంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. 

ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చి మురాసురుడిని చంపాడని.. అయితే ప్రస్తుతం తిరుమల వెంకన్నతో పెట్టుకుంటున్న వారి సంగతేంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. 

‘‘ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి... విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చి మురాసురుడిని చంపాడంట.. వెంకటేశునితోనే పెట్టుకుంటున్న వారి సంగతి ఏంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. భక్తి ప్రపత్తులతో ఏకాదశిని జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చి మురాసురుడిని చంపాడంట. అలాంటిది తిరుమల వెంకటేశునితోనే పెట్టుకుంటున్న వారి సంగతి ఏంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. భక్తి ప్రపత్తులతో వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్న వారందరికీ పండుగ శుభాకాంక్షలు pic.twitter.com/ARpkZpA1LF

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn)

ఇదిలా ఉండగా... తిరుమల విషయమై గురువారం లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైఎస్ జగన్ పై నారా లోకేష్ మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతిలో శ్రీవారి పై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టమని మండిపడ్డారు.

 జగన్ రెడ్డికి దేవుడంటే లెక్కలేదు,ప్రజలంటే గౌరవం లేదు. వైకాపా నాయకుల అహంకారానికి హద్దేలేదు. భక్తులపై లాఠీ ఛార్జ్ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.

తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలకు రద్దు చేసుకోకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదు. వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు బాగా తెలుసు జగన్ రెడ్డి గారు... అంటూ ట్వీట్ చేశారు. 

click me!