ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ అసెంబ్లీ తీర్మానం: బీజేపీపై బాబు విమర్శలు

By narsimha lodeFirst Published Sep 19, 2018, 5:13 PM IST
Highlights

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను  అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు తీర్మానం చేసింది. 


అమరావతి:ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను  అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు తీర్మానం చేసింది. ఈ గడ్డపై  పుట్టిన ప్రతి ఒక్కరూ  కూడ  ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన హామీలను అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.

బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో  ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారు.ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్రంపై చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.

ఈ తీర్మానంపై మాట్లాడిన బీజేపీ శాసనసభపక్ష నేత  విష్ణుకుమార్ రాజు  చేసిన ప్రసంగానికి  బాబు సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను  ఇవ్వాలని  కేంద్రం డిమాండ్ చేసినా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

హోదా హమీని కేంద్రం ఎందుకు నేరవేర్చలేదని ఏపీ శాసనసభ ప్రశ్నించింది.విభజన హమీ చట్టంలోని అన్ని హమీలను నెరవేర్చాలి ఏపీ శాసనసభ డిమాండ్ చేస్తోందన్నారు. 

29 సార్లు ఢిల్లీకి వెళ్లినా కూడ  కేంద్రం పట్టించుకోలేదన్నారు.ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీల్లో 90 శాతం హమీలను  అమలు చేశామని  బీజేపీ నేతలు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ ఆంధ్రుడైతే ప్రత్యేక హోదాపై తాను పెట్టిన తీర్మానాన్ని సమర్థించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారో చూపించాలని చంద్రబాబుప్రశ్నించారు. 

హోదా, చట్టంలోని హామీల అమలు కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. బీజేపీపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అంటూ నిలదీశారు. 

11 రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇవ్వమని అడిగామని, దెబ్బతిన్న వారినే మళ్ళీ దెబ్బకొట్టాలని చూస్తున్నారని, చరిత్ర, భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదని చంద్రబాబు హెచ్చరించారు.

ఏపీ బీజేపీ నేతలకు బ్రిటిష్ వారికి తేడా ఏముందని బాబు ప్రశ్నించారు. ఏపీ అభివృద్ది విషయంలో ఇక్కడి బీజేపీ నేతలకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జగన్ కు బీజేపీ అంటే భయమని చంద్రబాబునాయుడు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. తోక జాడిస్తే  శశికళ ఉదంతం రిపీట్ అవుతోందని  జగన్ భావిస్తున్నాడని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.

తాను ప్రవేశపెట్టినా తీర్మానాన్ని ఏపీ బీజేపీ నేతలు బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. నేను చేసే ఏ పోరాటమైనా కేంద్రంపై హక్కుల కోసమే
ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ పోరాటాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి  అన్యాయం జరుగుతోంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. 

ఏపీకి న్యాయం కోసం ప్రతి ఒక్కరూ బొబ్బిలిపులిలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముందే ఆంధ్రుడిని.. ఆ తర్వాతే  పార్టీ అంటూ  చంద్రబాబునాయుడు చెప్పారు.
 

click me!