చంద్రబాబు అరెస్ట్ : నిరసనగా రోడ్డు పైనే శిరోముండనం...(వీడియో)

By SumaBala BukkaFirst Published Sep 11, 2023, 11:00 AM IST
Highlights

చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బలుసు నాగేశ్వరరావు అనే కార్యకర్త రోడ్డుమీద శిరోముండనం చేయించుకుని తన నిరసన వ్యక్తం చేశారు.  

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భాగంగానే..చంద్రబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టిడిపి సీనియర్ కార్యకర్త బలుసు నాగేశ్వరరావు రోడ్డు పైనే గుండు గీయించుకున్నారు. 

కొయ్యలగూడెంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసనగా రోడ్డు మీదే గుండు గీయించుకున్నారు. టిడిపి సీనియర్ కార్యకర్త బలుసు నాగేశ్వరరావుకు టీడీపీ కార్యకర్తలు మద్దతు పలికారు. ఆయన గుండు గీయించుకుంటున్నంత సేపు.. ‘సైకో డౌన్..డౌన్..’ అంటూ నినాదాలు చేశారు. 

‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి..’, ‘సీఎం డౌన్..డౌన్...’, ‘సైకో డౌన్..డౌన్..’ అంటూ స్లోగన్స్ ఇస్తూ బలుసు నాగేశ్వరరావుకు మద్దతు పలికారు. కాగా, చంద్రబాబునాయుడును శనివారం నాడు స్కిల్ డెవల్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం నంద్యాలలో అరెస్ట్ చేసిన తరువాత విజయవాడకు తరలించారు. 
ఆదివారం ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ చంద్రబాబుకు సిబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబు తరఫు లాయర్లు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలని చేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది. దీంతో సోమవారం హైకోర్టులో చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ వేశారు.

ఆదివారం రాత్రి చంద్రబాబు నాయుడును రాజమంత్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించారు. ఈ రోజు ఉదయం కూడా చంద్రాబాబుకు జైలులో వైద్య పరీక్షలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసే ఏర్పాట్లు చేశారు. ఆయనకు ఇంటి భోజనం, మందులు ఇవ్వడానికి ఓ వ్యక్తిగత సహాయకుడికి అనుమతి ఇచ్చారు. 

click me!