చంద్రబాబు నాయుడు కాన్వాయ్ దిగలేని విధంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారంటే సీన్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు రాజధాని భూముల విషయంలో జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు ఈసారి ఏకంగా చంద్రబాబుపై చెప్పులు విసిరేలా అసహనానికి గురయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. రాజధాని అంశాన్ని ఆసరాగా చేసుకుని తనకు చుక్కలు చూపించిన చంద్రబాబుకు అంతే స్థాయిలో చుక్కలు కంకణం కట్టుకున్న జగన్ అందుకు భారీ వ్యూహాన్నే రచించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా రాజకీయం చేస్తూ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కనీసం 100 రోజులు సమయం ఇవ్వడం సహజంగా జరిగేదే.
undefined
గతంలో మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు అది బాగా తెలుసు. కానీ చంద్రబాబు ప్రతిపక్షంలో వచ్చాక ఆ విషయం మరచిపోయారు. అమరావతి కేంద్రంగా జగన్ పై దాడికి దిగారు. నిత్యం ప్రెస్మీట్లు పెట్టి జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించి ప్రజలను గందరగోళంలో పడేశారంటూ వైసీపీ భావిస్తోంది.
అమరావతి పర్యటన... చంద్రబాబు బస్సుపై చెప్పుతో దాడి
మళ్లీ రాజధాని అమరావతి కేంద్రంగా చంద్రబాబు మరో కొత్త అంశానికి తెరలేపారు. రాజధాని విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తానంటూ పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే ఈసారి అవకాశాన్ని చంద్రబాబుకు ఇవ్వకూడదనుకున్న జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారవుతుందనుకున్న తరుణంలో జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. అమరావతి విషయంలో తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలియజేసే ధోరణిలో కీలక నిర్ణయం ప్రకటించారు.
ఈనెల 25న సోమవారం సీఆర్డీఏపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాజధాని నిర్మాణ పనులను కొనసాగించాలని నిర్ణయించారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న పనులను తిరిగి ప్రారంభించాలని, సీఆర్డీఏ పరిధిలోని పనులను సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యతల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అనుగుణంగా పనులు ఉండాలని ఆదేశించారు.
సీఆర్డీఏ పరిధిలో ప్లానింగ్ పొరబాట్లు ఉండొద్దని సమావేశంలో జగన్ అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ సర్కార్ అమరావతి పనుల విషయంలోనూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని సీఎం కీలక నిర్ణయం ప్రకటించారు.
దాంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ పరిస్థితి ఏంటా అనుకుంటున్న రైతుల్లో జగన్ నిర్ణయం కాస్త ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. జగన్ నిర్ణయంతో రాజధాని రైతుల్లో చీలిక వచ్చింది. రెండు వర్గాలుగా రైతులు చీలిపోయారు.
జగన్ నిర్ణయం పట్ల ఒక వర్గం రైతులు హర్షం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయానికి ఫిదా అవ్వడంతోపాటు పాలాభిషేకం కూడా చేశారు. ఈ వ్యవహారం జరుగుతున్నా చంద్రబాబు నాయుడు ఏమీ పట్టించుకోలేదు. రాజధాని రైతులు తనకే బ్రహ్మరథం పడతారని భావించారు.
చంద్రబాబు అమరావతి పర్యటన... ఓవైపు స్వాగతం..మరోవైపు నిరసనలు
అయితే సీఎం జగన్ ప్రకటనతో రైతుల్లో చీలిక వచ్చినా తన పర్యటనకు అంత ఎఫెక్ట్ ఉండబోదని చంద్రబాబు భావించారు. కానీ చంద్రబాబు వ్యూహానికి చెక్ పెట్టారు సీఎం జగన్. రాజధాని రైతుల్లో చీలిక తెచ్చిన జగన్ మాజీ సీఎం చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. దాంతో టీడీపీ టీం గందరగోళంలో పడింది.
చంద్రబాబు నాయుడు కాన్వాయ్ దిగలేని విధంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారంటే సీన్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు రాజధాని భూముల విషయంలో జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు ఈసారి ఏకంగా చంద్రబాబుపై చెప్పులు విసిరేలా అసహనానికి గురయ్యారు.
అమరావతిలో నిర్మాణాలకు జగన్ గ్రీన్‌సిగ్నల్: రైతులకు ప్లాట్లు కూడా