నంద్యాల్లో చంద్ర‌బాబు మ‌కాం

Published : Aug 16, 2017, 02:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నంద్యాల్లో చంద్ర‌బాబు మ‌కాం

సారాంశం

నంద్యాల ప్రచారం చంద్రబాబు మూడవ సారి పర్యటన ఖరారు తో పీక్ చేరింది. 19,20,21వ తేదీల్లో నంద్యాల పర్యటించనున్న బాబు ఇప్పటికే 8 రోజుల ప్రచారం చేసిన వైసీపి అధ్యక్షుడు జగన్

 ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నంద్యాల ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. ఇప్ప‌టికే నంద్యాల్లో జ‌గ‌న్ రోడ్ షోల‌తో ప్ర‌చారం హోరెత్తిపోతుంది, ఇక చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఖ‌రారుతో మ‌రింత పీక్‌కి చేరింది. టీడీపీ అభ్య‌ర్థి గెలుపు కోసం క్యాబినేట్ లోని ప‌లువురు మంత్రులు నంద్యాల్లో ప్ర‌చారం కొన‌సాగుస్తున్నారు. వైసీపి అభ్య‌ర్ధి గెలుపు కోసం అధ్య‌క్షుడు జ‌గ‌న్‌, ఇత‌ర ఎమ్మేల్యేలు ప్ర‌చారం చేస్తున్నారు. ఇదివ‌ర‌కు రెండు సార్లు నంద్యాల్లో ప్రచారం చేసిన బాబు, ఇప్పుడు ప్ర‌చారానికి మూడవ సారి వ‌స్తున్నారు, అందుకు ఆయ‌న నంద్యాల టూర్ తేదీలు ఖరారు అయ్యాయి.

 చంద్రబాబునాయుడు నంద్యాల పర్యటన మూడు రోజుల పాటు సాగుతుంది. ఈనెల 19, 20, 21వ తేదీల్లో పర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ప్ర‌చారం లో భాగంగా రోడ్ షోలు నిర్వ‌హించ‌నున్నారు, అదేవిధంగా ప‌లువురు నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తారు. మూడు రోజుల పాటు చంద్ర‌బాబు నంద్యాల్లో ప్ర‌చారం చేస్తారు. 21వ తేదీ సాయంత్రం చంద్ర‌బాబు తిరిగి విజ‌య‌వాడ చేరుకుంటారు. నంద్యాల ఉప ఎన్నిక 23వ తేదీన జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Free Bus: విద్యార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. ఆ రోజు ఆర్టీసీ బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం
Vemireddy Prashanthi Reddy Fires On Gudiwada Amarnath | Asianet News Telugu