పథకాలన్నీ కట్‌... బాబు ఆడియో వైరల్‌!

By ramya Sridhar  |  First Published Jun 4, 2024, 12:26 PM IST

దీనికి టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ధీటుగా కౌంటర్‌ ఇస్తోంది. ఇలాంటి ఆడియోలు ఎలా క్రియేట్ చేస్తారంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై టీడీపీ మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం ఖాయమైంది.  వైసీపీకి ఓటర్లు షాకిచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో పథకాలన్నీ కట్‌ అంటూ చంద్రబాబును పోలిన వాయిస్‌ను వైరల్‌ చేస్తోంది. ''రెండు వారాల్లో పోలింగ్‌ ఉంది... ఎలక్షన్‌ ఎలాగైనా గెలుస్తాం. పవర్లోకి వస్తున్నాం. పథకాల్లేవు ఏమీ లేవు. అమరావతిని అభివృద్ధి చేస్తాం. ఊహంచనన్ని రిటర్న్స్‌ ఉంటాయ్‌'' అని చంద్రబాబు అన్నట్లు ఓ ఆడియో క్లిప్‌ను వైసీపీ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తోంది.....

దీనికి టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ధీటుగా కౌంటర్‌ ఇస్తోంది. ఇలాంటి ఆడియోలు ఎలా క్రియేట్ చేస్తారంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై టీడీపీ మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ప్రజలు ఓటు వేసి చంద్రబాబును ప్రజలు గెలిపించుకున్నారని.. ఇంకేమీ చేయలేరంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. 'ఐదు రూపాయలు పేటీఎం బ్యాచ్‌, వైసీపీ పని ఎప్పుడో అయిపోయింది. ఇక జైలుకెళ్లడమే...' అంటూ మరికొందరు టీడీపీ అభిమానులు కౌంటర్‌ ఇచ్చారు...

Latest Videos

 

click me!