టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేనకు దక్కింది. కూటమి అభ్యర్ధిగా పంచకర్ల రమేష్ బాబు బరిలోకి దిగారు.
పెందుర్తి నియోజకవర్గ రాజకీయాలు :
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగానే విశాఖ జిల్లాలో పలు సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది టిడిపి. ఇలా జనసేన పార్టీకి పెందుర్తి టికెట్ దక్కింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని కాదని మరీ ఈ సీటును జనసేనకు కేటాయించింది టిడిపి. గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. ఇలా పిఆర్పి నుండి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఇప్పుడు జనసేన నుండి మరోసారి పోటీ చేస్తున్నారు.
పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. పెదగంట్వాడ (కొంతభాగం)
2. పరవాడ
3. సబ్బవరం
4. పెందుర్తి
పెందుర్తి అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,68,878
పురుషులు - 1,34,992
మహిళలు - 1,33,883
పెందుర్తి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీచేసి గెలిచిన అన్నంరెడ్డి అదీప్ రాజ్ కే ఈసారి కూడా వైసిపి అవకాశం ఇచ్చింది. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చినా పెందుర్తిలో మాత్రం అదీప్ రాజ్ నే పోటీలో నిలిపింది వైసిపి అదిష్టానం.
జనసేన అభ్యర్థి :
టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేనకు దక్కింది. కూటమి అభ్యర్ధిగా పంచకర్ల రమేష్ బాబు బరిలోకి దిగారు. ఆయన గతంలో ప్రజారాజ్యం నుండి ఇదే పెందుర్తిలో గెలిచారు.
పెందుర్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
పెందుర్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందింది. YSRCPకి చెందిన అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పై జనసేనకు చెందిన పంచకర్ల రమేష్ బాబు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పంచకర్ల రమేష్ బాబు 149,611 (48.7 %) ఓట్లు పొందగా.. అన్నంరెడ్డి అదీప్‌రాజ్67,741 (29.43%) ఓట్లు సాధించారు
పెందుర్తి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,01,115 (75 శాతం)
వైసిపి - అన్నంరెడ్డి ఆదీప్ రాజ్ - 99,759 ఓట్లు (49 శాతం) - 28,860 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - బండారు సత్యనారాయణమూర్తి - 70,899 ఓట్లు (35 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - చింతలపూడి వెంకటరామయ్య - 19,626 (09 శాతం)
పెందుర్తి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,82,248 ఓట్లు (78 శాతం)
టిడిపి - బండారు సత్యనారాయణమూర్తి - 94,531 (51 శాతం) - 18,648 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - గండి బాబ్జీ- 75,883 (41 శాతం) - ఓటమి
ఇక 2024 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం ఎవరి సొంతం అవుతుందో చూడాలి.