పిఠాపురం... ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా వినిపిస్తున్న నియోజవర్గం పేరిదే. ఇక్కడినుండే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీచేస్తున్నారు... దీంతో ఒక్కసారిగా పిఠాపురం అసెంబ్లీపై రాజకీయ వర్గాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు, ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం లాంఛనంగానే కనిపిస్తోంది.
పిఠాపురం రాజకీయాలు :
టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్ధిగా పిఠాపురం అసెంబ్లీలో పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమయ్యింది. రాజకీయ సమీకరణలన్నీ కుదరడంతో పిఠాపురం బరిలో నిలిచారు పవన్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన కొన్ని నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. అలాగే టిడిపి, బిజెపిలకు కూడా గతంలో ఇక్కడినుండి ప్రాతినిధ్య వుంది. అలాగే ఇక్కడ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో కాపు ఓటర్లు వున్నారు. ఇలా పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా వుండటంతో పవన్ పోటీ చేశారు.
undefined
అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీనుండి ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత ప్రస్తుతం పవన్ పై పోటీ చేస్తున్నారు. ఆమెను ఇప్పటికే పిఠాపురం అభ్యర్థిగా వైసిపి ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కనపెట్టి గీతను అభ్యర్థిగా ఎంపికచేసింది వైసిపి.
పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. గొల్లప్రోలు
2. పిఠాపురం
3. కొత్తపల్లి
పిఠాపురం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,29,729
పురుషులు - 1,15,852
మహిళలు - 1,13,872
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగా గీతా విశ్వనాథ్ మరోసారి పోటీ చేసారు. గతంలో ప్రజారాజ్యం నుండి పోటీచేసి గెలిచిన ఈమె ప్రస్తుతం వైసిపి నుండి పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు మరో అవకాశం దక్కలేదు.
జనసేన అభ్యర్థి :
టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయన ఎంట్రీతో పిఠాపురం పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి.
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,86,682 (83 శాతం)
వైసిపి - పెండెం దొరబాబు - 83,459 (44 శాతం) - 14,992 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - ఎస్వీఎస్ఎస్ వర్మ - 68,467 (36 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - మాకినీడి శేషు కుమార్ - 28,011 (15 శాతం)
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,49,479 (78 శాతం)
స్వతంత్ర అభ్యర్థి - ఎస్విఎస్ఎస్ వర్మ - 97,511 (57 శాతం) - 47,080 ఓట్ల భారీ మెజారిటీతో విజయం
వైసిపి - పెండెం దొరబాబు -50,431 (29 శాతం) - ఓటమి
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికలు 2024 ఫలితాలు :
గతంలో ఎన్నడూ లేనం మేజారిటీ దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. 14వ రౌండ్ తర్వాత పవన్ 61,152 ఓట్ల అధక్యంలో ఉన్నారు.