అచ్చెన్నకు నోటీసులు.. నిన్ననే హైకోర్టుకు వెళ్లొచ్చింది మర్చిపోయారా?: డిజిపికి చంద్రబాబు హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jan 28, 2021, 5:16 PM IST
Highlights

 అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల పాలనలో ఏం చేశారని మీకు ఓటు వేయాలి? వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? అని చంద్రబాబు నిలదీశారు. 

అమరావతి: వైసిపి ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బీసీలపై కక్ష కట్టారని...అందువల్లే బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలో డీఎస్పీ శివరామిరెడ్డి కేవలం టీడీపీ నేతల్నే ఇబ్బంది పెడుతున్నారన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి 41-ఏ నోటీసులు ఇచ్చారని... అసలు ఈ41-ఏ నోటీసులు ఎందుకిస్తారో తెలుసా? అని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. 

''  పోలీసుల పరువు తీయాలనుకుంటున్నారా? ఉద్యోగ సంఘాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా? జగన్ తీరుతో చాలా మంది అధికారులు జైళ్లకు వెళ్లారు. ఇంకా కొంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు'' అని మండిపడ్డారు. 

''వైసీపీ మంత్రులు, పార్టీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. బలవంతపు, ఏకపక్ష ఏకగ్రీవాలను ఖచ్చితంగా అడ్డుకుంటాం. భయపెట్టి, బెదిరించి ఏకగ్రీవాలు చేస్తారా? 2014లో 2.67 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. 2020లో ఏకంగా 23 శాతం ఏకగ్రీవం చేశారు. 2014లో 1.15 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. 2020లో ఏకంగా 19 శాతం ఏకగ్రీవం చేశారు'' అని వెల్లడించారు.

read more  బెదిరించి ఏకగ్రీవాలు: పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బాబు

''అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల పాలనలో ఏం చేశారని మీకు ఓటు వేయాలి? వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? టీడీపీ హయాంలో అన్ని అంశాల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండేది ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని భ్రష్టుపట్టించారు. ప్రజలకు తాగునీటిని కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏలూరు, దెందులూరు ఘటనలకు సమాధానం చెప్పలేని పరిస్థితి.  తంబళ్లపల్లెలో కూర్చొని ఏకగ్రీవాలు చేస్తారా? ఆ గ్రామాల్లో పోటీ చేసేందుకు ఎవరూ లేరా?'' అని నిలదీశారు. 

''గ్రామ స్వపరిపాలన ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఉపాధి హామీ నిధులను కూడా మళ్లిస్తారా? రాష్ట్రంలో భద్రత, ప్రశాంతతకు భరోసా లేదు. 120కిపైగా దేవాలయాలపై దాడులు చేస్తారా? నేను రామతీర్థం పోకపోతే వీళ్లు కంట్రోల్ అయ్యేవారా? వీళ్ల కుట్రలను బయట పెట్టాను కాబట్టే కంట్రోల్ అయ్యారు'' అన్నారు.

''పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు జరగకపోయినా రాష్ట్రాన్ని , గ్రామాలను ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియాలి. వైసీపీ నేతలు ఉపాధి హామీ నిధులకు రుచి మరిగారు. రౌడీయిజంతో చేసే ఏకగ్రీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించం. ఇలాంటి చర్యలతో గ్రామాల్లో నాయకత్వం నిర్వీర్యం అవుతుంది. మాచర్ల, తెనాలి లాంటి ఘటనలు జరిగితే ఇకపై చూస్తూ ఊరుకోం'' అని హెచ్చరించారు.

''పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఆయనకు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు. ఏకగ్రీవాలపై సీఎం మంత్రులకు టార్గెట్లు పెడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకాలే. వైసీపీ నేతలు ఎవరికీ దొరికింది వాళ్లు దోచుకుంటున్నారు. వైసీపీ సర్కారు దోచింది కొండంత.. ప్రజలకు చేసింది గోరంత. ఎంతోమంది  సీఎంలను చూశాను.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి పదువుల్లో ఉండే హక్కు లేదు'' అని చంద్రబాబు మండిపడ్డారు. 

click me!