టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల జాబితా విడుదల

Published : Sep 23, 2017, 05:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల జాబితా విడుదల

సారాంశం

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల్లో 17మందికి చోటు తెలంగాణ కమిటీ అధ్యక్షుడిగా ఎల్.రమణ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు

టీడీపీ పొలిట్ బ్యూరో, జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తయిందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఈ రోజు నిర్వహించి న మీడియా సమావేశంలో ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల వివరాలను వివరించారు. మొత్తం 17 మంది సభ్యులు ఉంటారని కొత్తగా తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించినట్టు చెప్పారు. ఇటీవల పార్టీని వీడి తెరాసలో చేరిన రమేశ్‌ రాఠోడ్‌ స్థానంలో సీతక్కను తీసుకున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీలో 105 మంది, తెలంగాణ కమిటీలో 114 మంది ఉంటారని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ కమిటీకి ఎల్‌.రమణ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీకి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉంటారని తెలిపారు. త్వరలోనే పార్టీ అనుబంధ సంఘాలు, కమిటీలు ప్రకటించనున్నట్టు సీఎం వెల్లడించారు.

పొలిట్ బ్యూరో సభ్యుల జాబితా..

నారా చంద్రబాబు నాయుడు,  అశోక్‌గజపతిరాజు,  యనమల రామకృష్ణుడు , నిమ్మకాయల చినరాజప్ప , కేఈ కృష్ణమూర్తి, హరికృష్ణ , కాలవ శ్రీనివాసులు , దేవేందర్‌గౌడ్‌ , ఉమా మాధవరెడ్డి , మోత్కుపల్లి నర్సింహులు , రావుల చంద్రశేఖర్‌రెడ్డి , సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి , ప్రతిభా భారతి , అయ్యన్నపాత్రుడు , నామా నాగేశ్వరరావు , రేవూరి ప్రకాశ్‌రెడ్డి,  సీతక్క

PREV
click me!

Recommended Stories

నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ | RK Roja Sensational Comments on Chandrababu | Asianet News Telugu
నాకెప్పుడూ ఇలాంటి ఆలోచన రాలేదు జగన్ కి వచ్చింది అందుకే.. Chandrababu on Jagan | Asianet News Telugu