
ముఖ్యయంత్రి చంద్రబాబుకు విలువలు లేని మనిషని, ఆయనకు విలువలంటే లెక్కే లేదని ధ్వజమెత్తారు వైసీపి నేతలు. నంద్యాల ఉప ఎన్నికలను ధర్మానికి అధర్మానికి మద్య జరగుతున్న యుద్ధంగా చిత్రీకరించారు వైసీపి ఎంపీ బుట్టా రేణుకా. ధర్మం వైసీపీ వైపే ఉంది, నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయంలొ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
చంద్రబాబు అభివృద్ది జపం చేస్తున్నారని బుట్టా రేణుకా ఆరోపించారు, మూడున్నర సంవత్సరాల్లో చేయని అభివృద్ది ఇప్పుడు ఎలా చేస్తారు అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు హామీలు శిలాఫలకాలకే పరిమతమయ్యాయి అని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో వృద్దులకు, వితంతువులకు పింఛను అందడం లేదని ఆమె తెలిపారు. యువతకు ఉద్యొగాలు లేకా అల్లాడుతున్నారని, మరోవైపు రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు అని ఆమె పెర్కొన్నారు. వీటన్నింటిని ఫలితంగా టిడిపీకి ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. వైసీపి తప్పకుండా నంద్యాల్లో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం వైసీపి ఎమ్మేల్యే ఐజయ్య కూడా మాట్లాడారు. ఆయన చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పచ్చి మోసకారని, ఆయన తన మాటలతో ఎంతటివారినైనా మోసం చేస్తారని ధ్వజమెత్తారు. అయితే చంద్రబాబు చేసే మోసపూరిత వాగ్దానాలు నంద్యాల ప్రజలు నమ్మరు అని అన్నారు. జగన్ బహిరంగ సభను చూసి చంద్రబాబుకు దడ పుట్టింది అని ఆయన అన్నారు. టిడిపి నుండి వైసీపీ వచ్చిన ఎంఎల్సీ శిల్పా చక్రపాణీ రెడ్డి తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యాంగ విలువలు కాపాడారని ఆయన తెలిపారు. టీడీపీ 20 మంది ఎమ్మెల్యే లను ప్రలొభపెట్టి మంత్రి పదవులు ఆశ చూపి వైసీపీ నుండి టిడిపిలొకి రాజ్యాంగ విరుద్దంగా చేర్చుకున్నారు అని ఆయన విమర్శించారు. అస్సలు బాబుకు విలువలు లేవని, అందుకు నంద్యాల ప్రజలు తగిన బుద్ది చెబుతారని మండిపడ్డారు.