(వీడియో) ఎంఎల్సీకి చక్రపాణి రాజీనామా

Published : Aug 03, 2017, 05:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
(వీడియో) ఎంఎల్సీకి చక్రపాణి రాజీనామా

సారాంశం

బుధవారం రాత్రి తనను కలసిన చక్రపాణితో జగన్ మాట్లాడుతూ ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ చెప్పారు. దాంతో గురువారం నంద్యాలలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ, ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎల్సీ అయిన 90 రోజుల్లోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటం గమనార్హం.

వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేసారు. బుధవారమే చక్రపాణి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, బుధవారం రాత్రి తనను కలసిన చక్రపాణితో జగన్ మాట్లాడుతూ ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ చెప్పారు. దాంతో గురువారం నంద్యాలలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ, ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎల్సీ అయిన 90 రోజుల్లోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటం గమనార్హం. విలువలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వైసీపీలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు రాజీనామాలు చేయగలరా అంటూ సవాలు విసరటం గమనార్హం. తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపుతున్నట్లు కూడా చక్రపాణిరెడ్డి చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

Perni Nani Pressmeet: ఇది ఒక దగాకోరు ప్రభుత్వం కూటమి పై రెచ్చిపోయిన పేర్ని నాని| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar:భవిష్యత్తులో ఇంధన పొదుపు చాలా కీలకం: మంత్రి గొట్టిపాటి| Asianet Telugu