సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో.. చైన్ స్నాచర్ల బీభత్సం.. వృద్ధురాలు మృతి..

Published : May 31, 2022, 07:51 AM IST
సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో.. చైన్ స్నాచర్ల బీభత్సం.. వృద్ధురాలు మృతి..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎం జగన్ నివాసానికి సమీపంలోనే దొంగతనానికి పాల్పడ్డారు. మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనలో కిందపడ్డ మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందింది. 

మంగళగిరి :  సీఎం YS Jagan నివాసానికి సమీపంలో 
Chain snatchers దురాగతానికి ఒక వృద్ధురాలు బలి అయ్యింది. 
Police Constable అయిన తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆమె మెడలోని Gold chainను దుండగులు తెంపుకుపోయారు. ఈ క్రమంలో వారు గొలుసును గట్టిగా లాగడంతో ఆమె బైక్ పై నుంచి కింద పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది.  సీఎం నివాసానికి సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన పోలీసుల నిఘా వైఫల్యం, గస్తీలేమికి నిదర్శనం.  బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించడం, దుండగుల్ని పట్టుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి.

విజయవాడ ఏసీబీ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శివ..  తన తల్లి జయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 28న మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి బైక్పై వెళ్లారు. తిరుగుప్రయాణంలో విజయవాడ వస్తుండగా.. వీరి బైక్ ను ఇద్దరు దుండగులు వెంబడించారు. ఎర్రబాలెం దగ్గర ఆప్కో రాష్ట్ర కార్యాలయం సమీపంలోకి రాగానే జయలక్ష్మి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆ ధాటికి ఆమె కింద పడిపోవడంతో  తీవ్ర గాయాలయ్యాయి.  శివ స్థానికుల సహాయంతో తల్లిని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం. మృతి చెందింది. మూడు రోజులు గడుస్తున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోలేదు. సీసీ కెమెరా లో నిందితుల కదలికలు నమోదయ్యాయని, వారి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. 

కాగా, మార్చిలో హైదరాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ చిక్కకుండా తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. Two wheeler మీద వెళుతున్న దంపతులను  బైక్ మీద వెంబడించి Woman మెడలోని గొలుసు తెంచుకుని విమానంలో పారిపోవడానికి ప్రయత్నించిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. గొలుసు లాక్కునే క్రమంలో మహిళ వాహనంపై పడి గాయాలపాలైనా అతను కటువుగా వ్యవహరించాడు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్మెట్ సీఐ వాసం స్వామి కథనం ప్రకారం..  యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెంది తూపల్లి నరసింహ రెడ్డి కుటుంబం నగరంలోని హస్తినాపురం అనుపమ నగర్ కాలనీలో ఉంటున్నారు.  

ఘటనకు 4 రోజుల క్రితం  నరసింహారెడ్డి (65), భార్య కమల (55)తో కలిసి బ్రాహ్మణపల్లి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం బైక్పై తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద హైవే పై ఓ దుండగుడు బైక్ మీద వెనకనుంచి వచ్చి కమల మెడలోని   పుస్తెలతాడు తెంచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది.  కొంత దూరం వెళ్ళిన నిందితుడు తిరిగి వచ్చి కమల మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడు తెంచుకొని నగరం వైపు పరారయ్యాడు. 

బాధితుడి ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.  లభించిన సాంకేతిక ఆధారాలతో.. నిందితుడు  ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ చన్వర్ గేట్లో నివసించే హేమంత్ గుప్తా (24)గా గుర్తించారు. గాజుల దుకాణంలో పనిచేసే అతను తాను ఎంచుకున్న ప్రాంతానికి విమాన టికెట్లు బుక్ చేసుకుని గొలుసుల చోరీలు చేసి వెళ్తుంటాడు. ఇలా ఆరుసార్లు తప్పించుకున్నాడు. ఏడోసారి తప్పించుకుని విమానంలో పారిపోతుండగా, అబ్దుల్లాపూర్మెట్, విమానాశ్రయ, ఎల్బీనగర్ సిసిఎస్ పోలీసులు కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు. పుస్తెలతాడుతో పాటు బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

అయితే, హేమంత్‌ గత కొన్ని నెలలుగా కనీసం ఆరుసార్లు హైదరాబాద్‌కు ఇలా వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉదయం విమానంలో రావడం.. బైక్ అద్దెకు తీసుకోవడం.. గొలుసులు తెంచుకుని.. పనికాగానే మళ్లీ రిటర్న ఫ్టైట్ లో వెళ్లిపోవడం.. ఇది అతని షెడ్యూల్. దీనివల్ల నిందితుడిని పట్టుకోలేరు. ఈ సారి మాత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. హేమంత్‌ బైక్‌కు సంబంధించిన వాహన రిజిస్ట్రేషన్‌ వివరాలను గుర్తించారు. 

హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత అతడు ఈ-క్లాసిఫైడ్ పోర్టల్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పోలీసులు పోర్టల్ నుండి హేమంత్ ఫోన్ నంబర్‌ను సేకరించారు. ఆ తరువాత అతని ఫోన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో ట్రేస్ చేశారు. వెంటనేఅబ్దుల్లాపూర్‌మెంట్ పోలీసులు విమానాశ్రయ పోలీసు అవుట్‌పోస్ట్ బృందం, విమానాశ్రయ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వీరితో కలిసి, అన్ని విమానాల ప్రయాణీకుల వివరాలను శోధించి, ఉదయం 5.45 గంటలకు హేమంత్‌ను అరెస్టు చేశారు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు అప్పగించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?