
భారత జనగణన కార్యక్రమంలో భాగంగా చాగంటి కోటేశ్వరరావు దంపతులు కాకినాడ రూరల్ ప్రాంతంలో స్వంత నివాసంలో స్వయంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలందరూ భారత జనగణనలో ఉత్సాహంగా పాల్గొని, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ఖచ్చితమైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమని ఆయన తెలిపారు.