విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యోగులకు కేంద్రం షాక్: హైకోర్టులో అఫిడవిట్

By telugu team  |  First Published Jul 28, 2021, 12:05 PM IST

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ మీద కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో పలు కీలకాంశాలను పొందుపరిచింది.


అమరావతి: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ లో కేంద్రం పలు కీలకాంశాలను పొందుపరిచింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కు విచారణార్హత లేదని తెలిపింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించవద్దని అనడం సరి కాదని కేంద్రం తన అఫిడవిట్ లో వాదించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వ్రైవేటీకరిస్తే ఉద్యోగులకు రాజ్యాంగబద్ధత ఉండదనే వాదనలో నిజం లేదని స్పష్టం చేసింది. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ జేడీ లక్ష్మినారాయణ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని, ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో రాజకీయ ఉద్దేశ్యం ఉందని, అందువల్ల ఆ పిటిషన్ కు విచారణార్హత లేదని కేంద్రం చెప్పింది.

Latest Videos

undefined

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మకానికి పెట్టామని, ఇప్పటికే అందుకు బిడ్డింగులను ఆహ్వానించామని చెప్పింది. ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. టీడీపీ కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటికరణను వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటికరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

click me!