ఏపీ: 24 గంటల్లో 183 మందికి కరోనా పాజిటివ్.. గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు

Siva Kodati |  
Published : Nov 25, 2021, 05:56 PM IST
ఏపీ: 24 గంటల్లో 183 మందికి కరోనా పాజిటివ్.. గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 183 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 163 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,194 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి (corona cases in ap). గడిచిన 24 గంటల్లో 183 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,69,119కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,431కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 163 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,52,494కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 30,863 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,02,86,530కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,194 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 5, చిత్తూరు 25, తూర్పుగోదావరి 13, గుంటూరు 30, కడప 6, కృష్ణ 27, కర్నూలు 4, నెల్లూరు 15, ప్రకాశం 7, శ్రీకాకుళం 21, విశాఖపట్నం 17, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 12 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh: కోట్లు విలువైన ఇంజెక్షన్ ఇచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్| Asianet Telugu
CM Chandrababu Naidu Rally మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళలకు ద్రోహం సీఎం ర్యాలీ| Asianet News Telugu