ఏపీ వరదలు: నవంబర్‌ రెండో వారంలో రాష్ట్రానికి కేంద్ర బృందం

By Siva KodatiFirst Published Oct 31, 2020, 4:53 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. నవంబర్ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానున్నట్లుగా తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. నవంబర్ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానున్నట్లుగా తెలుస్తోంది.

నవంబర్ 9, 10 తేదీల్లో కృష్ణా, గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారులు.. పంట నష్టం వివరాలను సిద్ధం చేస్తున్నారు.

మొత్తం 12 శాఖల్లో వరదల వల్ల నష్టం సంభవించినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు రూ.10 వేల కోట్ల వరకు పంట, ఆస్తి నష్టం జరిగినట్లు ఓ అంచనా. దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, సుమారు రెండున్నర లక్షల మంది రైతులకు వరదలు కన్నీరు మిగిల్చాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో అక్వా రంగం దారుణంగా దెబ్బతింది. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. 

click me!