చంద్రబాబుకు మరో షాక్.. బీజేపీలోకి టీడీపీ నేత గద్దె బాబూరావు ...

Bukka Sumabala   | Asianet News
Published : Oct 31, 2020, 03:27 PM IST
చంద్రబాబుకు మరో షాక్.. బీజేపీలోకి టీడీపీ నేత గద్దె బాబూరావు ...

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబుకి షాక్ మీద షాక్ తగులుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రభుత్వ విప్‌ గద్దె బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. ఇప్పటికే బాబురావు పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 

టీడీపీ అధినేత చంద్రబాబుకి షాక్ మీద షాక్ తగులుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రభుత్వ విప్‌ గద్దె బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. ఇప్పటికే బాబురావు పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునీల్‌ దేవధర్‌ సమక్షంలో బాబూరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మీడియాతో మట్లాడుతూ... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలని పిలుపునిస్తున్నాను. ఎన్టీఆర్ కుమార్తె పురంధ్రేశ్వరికి పార్టీ కేంద్ర కమిటీలో స్థానం కలిపించారు.

చంద్రబాబు ఎవ్వరినైనా వాడుకుని వదిలేస్తారు. గత ఎన్నికల్లో తనకు అనుకూలమైన వ్యక్తులకు సీటివ్వలేదని పొత్తును వదులుకున్నానని చంద్రబాబు ప్రకటించాడు. మళ్లీ సాయంత్రమే కాళ్లబేరానికొచ్చాడు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వాడుకున్నాడు, మోసగించాడు, వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేయగలడు..? నిర్మాణమైన ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించలేకపోతున్నారు. బీజేపీ జాతీయ పార్టీ. మోడీ ఇజమ్.. ఎన్టీఆర్ విధానాలను ఇప్పుడు బీజేపీ అనుమతిస్తోంది.  

హుద్ హూద్ సమయంలో కింజరపు అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువుల పూడికలో అడ్డగోలుగా దోచేశారు. బాత్రూమ్‌ కట్టడంలో కూడా అవకతవకలకు పాల్పడి ఆ నిధులు కూడా తెలుగు దేశం పార్టీ నాయకుల జోబుల్లోకే వెళ్లాయి. 
చంద్రబాబు సొంత మండలంలో కూడా నిర్మాణాలు చేపట్టకుండానే నిధులన్నీ దోచేశారు. గతంలో చినరాజప్పకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా చేశారు అని సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు.  
 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు