చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న నితీన్ గడ్కరీ

First Published Jul 11, 2018, 6:26 PM IST
Highlights

కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఆయనకు ఇప్పటివరకు జరిగిన పనుల గురించి సీఎం వివరించారు. ఇద్దరూ కలిసి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులను పరిశీలించారు.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ప్రత్యేక హోదా విషయంపై విబేధాలు తలెత్తి ఎన్డీఏ నుండి టిడిపి బైటికి వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పోలవరం నిధుల విశయంలోను ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా నితిన్ గడ్కరీ పోలవరం పర్యటన ఆసక్తికరంగా మారింది. 

అయితే కేంద్ర మంత్రి గడ్కరీ రాక సందర్భంగా పోలవరం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గడ్కరీకి  స్వాగతం పలికేందుకు బారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అందించిన పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు.  దీంతో తమను కూడా అనుమతించాలని పాస్ లు లేని కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగుతూ ఆందోళన చేపట్టారు.  పోలీసులు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నినాదాలు చేయడంతో స్వల్ప గందరగోల వాతావరణం నెలకొంది.

click me!