
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు లభించింది. వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ఇప్పటికే ఏపీ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలుచేసిన కేంద్రం తాజాగా మరో అదనపు అఫిడవిట్ ను దాఖలుచేసింది. దీని ద్వారా రాష్ట్రాల రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత స్పష్టత ఇచ్చింది హోంశాఖ
. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదన్న ఈ అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదంది. కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావువి అన్నీ అపోహలేనని...రాజధానికి అవసరమైన ఆర్ధిక సాయం చేస్తామని మాత్రమే కేంద్రం కేంద్రం చెప్పిందన్నారు. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని మరోసారి కేంద్ర ప్రభుత్వం మరోసారి స్ఫష్టం చేసింది.
read more ముప్పేట దాడిపై మౌన వ్యూహం: వైఎస్ జగన్ కోర్ టీమ్ ఇదే
ఇదివరకే రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్రాల పరిధిలోని అంశమని... దానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలదేనంటూ కేంద్రం ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం పాత్ర వుండదన్నారు. ఇలా ఏపీ రాజధాని విషయంలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారులున్నాయని కేంద్రం తెలిపింది.
ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం మరో అదనపు అఫిడవిట్ ను కూడా దాఖలుచేసింది. ఏపీ రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు అందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం మాత్రమే కేంద్రం బాధ్యత అని హోంశాఖ తాజా అఫిడవిట్ లో పేర్కొంది.