విశాఖ పర్యటన.. చంద్రబాబుకి కేంద్రం అనుమతి

By telugu news teamFirst Published May 7, 2020, 1:00 PM IST
Highlights

చంద్రబాబు అభ్యర్థను కేంద్రం అంగీకరించింది. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపధ్యంలో క్షతగాత్రులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు అనుమతి కోరగా ప్రభుత్వ  హోంశాఖ అనుమతించింది. 

విశాఖలో గ్యాస్ లీకేజీతో భయానక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో 5 గ్రామాల ప్రజలు ఖాళీ చేశారు. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 8మంది మృతి చెందారని తెలిసింది. అయితే ఈ ఘటనపై ఇదివరకే స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కేంద్రం అనుమతి కోరారు.

విశాఖ వెళ్లేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు. చంద్రబాబు విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించి, పార్టీ తరపున సహాయ చర్యలు చేపట్టేందుకు బాబు కేంద్రం అనుమతి కోరారు. కాగా.. చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. కేంద్రం అనుమతిస్తే వెంటనే విశాఖ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.

కాగా.. చంద్రబాబు అభ్యర్థను కేంద్రం అంగీకరించింది. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపధ్యంలో క్షతగాత్రులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు అనుమతి కోరగా ప్రభుత్వ  హోంశాఖ అనుమతించింది. 

ఈరోజు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు చంద్రబాబు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి వెళతారు.అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి, ఆ తర్వాత క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా మృతిచెందాయి. కొన ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను ప్రభుత్వం వెంటనే కాపాడాలి. ఈ విష వాయువు సుమారు 3 కిలోమీటర్లు వ్యాప్తి చెందడంతో చెట్లన్నీ రంగుమారిపోమయాయి. దీన్ని బట్టి చూస్తే ఆ విషవాయువు తీవ్రత ఏంటో తెలుస్తుంది. యుద్దప్రాతిపదికన వెంటనే ప్రజలందరినీ ప్రభుత్వం ఖాళీ చేయించాలి. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరం. బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితులకు వెంటనే అత్యున్నత వైద్య సాయం అందించాలి’ అని చంద్రబాబు కోరారు.

click me!