కాపు రిజర్వేషన్లు ... కేంద్రం గుడ్‌న్యూస్, చంద్రబాబు హయాం నాటి బిల్లుపై కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Dec 21, 2022, 6:31 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాపు సామాజిక వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు చెల్లుతుందని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని తెలిపింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర జాబితాలో వున్న కాపులకు రిజర్వేషన్ల కల్పనలో తమ పాత్ర లేదని తెలిపింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు .. ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్రం వెల్లడించింది. 

ALso REad: కాపు, ఓబీసీ రిజర్వేషన్‌.. ఏపీ సర్కార్ తీర్మానంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన

2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని కేంద్రం వివరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. 

click me!